: రైల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఓ గర్భిణి రైల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో చోటుచేసుకుంది. ముంబయి - నాగర్కోయల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తోన్న ఓ గర్భిణికి ఈ రోజు ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన ప్రయాణికులు ఆ మహిళ రైల్లోనే ప్రసవించే విధంగా తగు ఏర్పాట్లు చేసి, దానిలోనే కాన్పు చేశారు. రైలు ధర్మవరం చేరుకోగానే ఈ సమాచారాన్ని ప్రయాణికులు స్టేషన్ అధికారులకు తెలిపారు. వెంటనే తల్లీబిడ్డలను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు.