: రాహుల్ ద్రవిడ్ ను బెంబేలెత్తించిన హైదరాబాదీ యువతి!


టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తన జీవితంలో చోటుచేసుకున్న గమ్మత్తైన సంఘటన గురించి తాజాగా వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... గతంలో ఓ సుదీర్ఘ పర్యటన అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ద్రవిడ్ బాగా అలసిపోవడంతో బాగా నిద్రపోయాడు. మధ్యాహ్నం భోజనం తరువాత అమ్మతో ఊసులు చెబుతూ మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. సాయంత్రం నిద్రలేపిన తన తల్లి, 'నీ కోసం ఒక అమ్మాయి వచ్చింది. నీ అభిమాని అని చెబుతోంది. చాలా సేపటి నుంచి నిరీక్షిస్తోంది. హాల్ లో కూర్చోబెట్టి వచ్చాన'ని చెప్పింది. తర్వాత ఫ్రెషప్ అయి వెళ్లి ఆమెను పలకరించానని, ఆమెకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చానని చెప్పాడు. ఈ తరువాత ఆమెను ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు? అని పలకరించానని తెలిపాడు. 'దానికి సమాధానమిస్తూ, తనది హైదరాబాద్ అని, తను నాకు పెద్ద అభిమానినని చెప్పింది. దీంతో సంతోషించా. ఆ వెంటనే నాకు షాక్ నిస్తూ... మీకు పెద్ద అభిమానిని కావడంతో మా అమ్మ-నాన్నలను వదిలేసి వచ్చేశా. మీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా అంటూ షాకిచ్చింది' అంటూ ద్రవిడ్ చెప్పాడు. ఆ తర్వాత ఎలాగో ఆమెకు సర్ది చెప్పి పంపించామని ద్రవిడ్ నవ్వుతూ చెప్పాడు.

  • Loading...

More Telugu News