: వెంకయ్యనాయుడికి రఘువీరారెడ్డి లేఖ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు లేఖ రాశారు. రేపు ఢిల్లీలో నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా అంశాన్ని కౌన్సిల్ ముందు ఉంచాలని రఘువీరారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను ఆమోదింపజేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.