: వివాదంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక సోదరుడు


బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాదంలో పడ్డాడు. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదివిన సిద్ధార్థ్ కి పుణెలో ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ లో హుక్కా సదుపాయం కల్పిస్తున్నాడని, అది నో స్మోకింగ్ జోన్ పరిధి కిందకు వస్తుందంటూ సిద్ధార్థ్ పై కేసు పెట్టారు. ఈ కేసును పుణె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రెస్టారెంట్ ఉన్న ఆవరణ మాత్రమే నో స్మోకింగ్ జోన్ పరిధిలోకి వస్తుందా? లేక ఆ ప్రాంతమంతానా? అన్న దానిపై స్పష్టత లేదు.

  • Loading...

More Telugu News