: టైపింగ్ లో ఒక్క అక్షరం తేడా... బ్రిటన్ ప్రధాని స్థాయి పడిపోయింది!
టైపింగ్ లో ఒక్క అక్షరం తప్పు కొట్టడంతో బ్రిటన్ ప్రధాని థెరెసా మేను గూగుల్ పోర్న్ స్టార్ ను చేసేసింది. వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్ ప్రధానిగా థెరెసా మే పదవీబాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మీడియాకు దూరంగా ఉండడంతో పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. దీంతో సుమారు మూడు దశాబ్దాల తరువాత బ్రిటన్ ప్రధాని పీఠంపై కూర్చోనున్న థెరిసా మే గురించి వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్ ను ఆశ్రయించారు. ముప్పై ఏళ్ల క్రితం ఐరన్ లేడీ మార్గరేట్ థాచర్ తరువాత థెరెసా మే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ. అయితే నెటిజన్లు గూగుల్ లో థెరిసా (theresa) మే అని టైప్ చేయడానికి బదులు ‘హెచ్’ లేకుండా తెరీసా (teresa) మే అని టైప్ చేశారు. దీంతో గూగుల్ తల్లి ఓ పోర్న్ స్టార్ ను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో తొలిసారి అపనమ్మకంగా చూసిన వారు మళ్లీ మళ్లీ ఆమె పేరు టైప్ చేయగా ఆ పోర్న్ స్టార్ బొమ్మే కనిపించేది. దీంతో బ్రిటన్ నవ ప్రధాని పోర్న్ స్టార్ అని చాలా మంది అనుకున్నారట. దీంతో కొందరు సోషల్ మీడియాలో ఆమె ఫోటో పోస్టు చేసి, బ్రిటన్ ప్రధాని అంటూ పలు వ్యాఖ్యలు కూడా జతచేశారు. తరువాత తీరిగ్గా అసలు విషయం తెలుసుకుని తమ మేధస్సుకు తామే సిగ్గుపడ్డారట.