: క్షమాపణ చెప్పేది లేదని భీష్మించుకుని కూర్చున్న సల్మాన్ ఖాన్!
"సుల్తాన్ సినిమా షూటింగులో భాగంగా కుస్తీ దృశ్యాలను చిత్రీకరించిన తరువాత పేకప్ చెప్పేసే సమయానికి అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితిలో ఉండేవాడిని" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశాడు. సల్మాన్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కమిషన్ ముందు హాజరు కావాలని రెండుసార్లు నోటీసులు పంపినా సల్మాన్ నిరాకరించాడు. తనను హాజరు కావాలని సమన్లు పంపే హక్కు చట్టపరంగా మహిళా కమిషన్ కు లేదని పేర్కొంటూ ఓ లేఖను రాశాడు. సల్మాన్ లేఖ తమకు అందిందని, దీన్ని పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ వెల్లడించింది.