: లోపాలు సవరించుకోవడానికి మీడియా గొప్ప సాధనం: హాస్యనటుడు సప్తగిరి


లోపాలు సవరించుకోవడానికి మీడియా అద్భుతమైన సాధనమని సినీ హాస్య నటుడు సప్తగిరి చెప్పాడు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా మనలోని లోపాలు ఎత్తి చూపుతుందని అన్నాడు. అయితే ఆ లోపాలను సానుకూల దృక్పథంతో చెబితే మార్చుకుంటామని, మీడియా కావాలని ఎత్తి చూపినప్పుడే సమస్య ఉత్పన్నమవుతుందని అన్నాడు. తన నటన ఒకే తరహాలో ఉంటుందని మీడియా ఆరోపిస్తుందని, తాను నటనలో అనుభవం సంపాదించుకుని సినిమాల్లోకి రాలేదని, నటనలో ఓనమాలు కూడా తనకు తెలియవని అన్నాడు. ఇప్పుడిప్పుడే నటనలో నడక నేర్చుకుంటున్నానని చెప్పిన సప్తగిరి, మీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించాడు. తన సినిమాలు నాలుగు చూస్తే అందులో వైవిధ్యం ఏమీ కనిపించదని, తాను కూడా దానిని అంగీకరిస్తానని చెప్పాడు. ఇప్పుడిప్పుడే తన నటనావిధానాన్ని మార్చుకుంటున్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News