: స్వాతికి, నాకు అఫైర్ లేదు: నిఖిల్
సినీ నటి స్వాతితో తనకు అఫైర్ ఏమీ లేదని సినీ హీరో నిఖిల్ తెలిపాడు. స్వాతి అద్భుతమైన నటి అని చెప్పిన నిఖిల్... మీడియాకు, అభిమానులకు ఎఫైర్స్ లాంటి స్పైసీ న్యూస్ వుంటే బాగుంటుందని చురక అంటించాడు. అలా వచ్చిన రూమర్లే తనతో స్వాతి అఫైర్ అని చెప్పాడు. స్వాతి చాలా ప్రొఫెషనల్ నటి అని చెప్పాడు. స్వాతి బిజీ హీరోయిన్ అని చెప్పిన నిఖిల్, అమెతో ఎప్పుడైనా ఒకసారి ఫోన్ లో మాట్లాడుతానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి అనుబంధం లేదని అన్నాడు. స్వాతితో అఫైర్ అంటూ వచ్చిన వార్తలపై తామిద్దరం చాలాసార్లు వివరణ ఇచ్చామని నిఖిల్ చెప్పాడు.