: ఇటలీలో ఘోర రైలు ప్రమాదం... రెండు రైళ్లు ఢీ
ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీ కొనడంతో ఇటలీ దక్షిణ ప్రాంతంలోని బారి నగర సమీపంలో 12 మంది ప్రయాణికులు మరణించారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఎమర్జెన్సీ సర్వీస్ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలిస్తోంది. బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తూ, సహాయకచర్యలు చేపడుతోంది. ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన పలు బోగీలు ధ్వంసమయ్యాయి. రైలు ప్రమాద ఘటనతో ఆ రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా అదనపు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రాక్‌పై 200 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ప్రమాదంపై ఆ దేశ ప్రధాని మాట్టెయో రేంజి విచారం వ్యక్తం చేశారు.