: 'కల్లోల కాశ్మీరం' నేపథ్యంలో రాజ్ నాథ్ అమెరికా పర్యటన వాయిదా
జమ్మూ కాశ్మీర్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన అమెరికా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ అనంతరం, కాశ్మీర్ లోయలో శాంతి భద్రతలు అదుపు తప్పగా, ఆరుగురు పోలీసులు సహా 29 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్న ఉద్దేశంతోనే రాజ్ నాథ్ తన పర్యటను వాయిదా వేసుకున్నారని, తిరిగి సెప్టెంబరులో ఆయన విదేశీ పర్యటన ఉంటుందని హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రధాని ఆఫ్రికా దేశాల పర్యటన నుంచి తిరిగి రాగానే, కాశ్మీర్ అల్లర్లపై సమీక్షించనున్నారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి.