: నటి రాణిముఖర్జీ పేరుపై నకిలీ ఎకౌంట్లు... అభిమానులకు విజ్ఞప్తి
ప్రముఖ బాలీవుడ్ నటి రాణిముఖర్జీ పేరుపై సామాజిక మాధ్యమాల్లో పలు నకిలీ ఎకౌంట్లు దర్శనమిస్తున్నాయని, వాటితో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని ఆమె తరఫు ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. రాణి ముఖర్జీ పేరిట ఉన్న నకిలీ ఖాతాల్లో ఆమె కూతురు అడిరా ఫొటో కనపడటంతో ఆయన ఈ ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో రాణి ముఖర్జీకి ఎటువంటి ఖాతాలు లేవని, ఇకపై ఉండబోవని, ఈ విషయాన్ని ఆమె అభిమానులు గుర్తుంచుకోవాలని కోరారు. ఆమె పేరిట ఉన్న నకిలీ ఖాతాలను ఫాలో కావద్దని, వాటిలో పొందుపరిచిన వివరాలు, పోస్ట్ చేసిన ఫొటోలు నిజం కాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.