: అన్నయ్యకు బిస్కెట్లంటే ఎంతో ఇష్టం: క్రికెట్ దిగ్గజం గవాస్కర్ చెల్లెలు


భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెస్టు క్రికెట్ లో పదివేల పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ గా, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 30కు పైగా సెంచరీలు సాధించిన గవాస్కర్ నిన్న తన 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా గవాస్కర్ చెల్లెలు నూతన్ గవాస్కర్ ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. గవాస్కర్ ఎప్పుడు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినా భారత్ నుంచి బిస్కెట్స్ అక్కడికి పంపించేవారమని చెప్పారు. పార్లే జీ గ్లూకోజ్ బిస్కెట్స్ అంటే ఆయనకు చాలా ఇష్టమని, అందుకే, ఆయన టూర్ కు వెళ్లినప్పుడల్లా ముంబై నుంచి వాటిని పంపించేవాళ్లమని తెలిపారు. పర్యటన షెడ్యూల్ ను అనుసరించి మూడు వారాల నుంచి నెలరోజుల వరకు సరిపడా బిస్కెట్లను పంపిస్తుండేవాళ్లమని, అక్కడికి వెళ్లే తమ స్నేహితులు, తెలిసిన వ్యక్తులు లేదా జర్నలిస్టుల ద్వారా బిస్కెట్ ప్యాకెట్లను పంపేవాళ్లమన్నారు. కాఫీ, టీ తాగేటప్పుడు బిస్కెట్లను తినడమంటే తమ అన్నయ్యకు చాలా ఇష్టమని చెప్పిన నూతన్, డయాబెటీస్ సమస్య కారణంగా గవాస్కర్ ఇప్పుడు బిస్కెట్లు తినడం లేదన్నారు. అయితే, ఎప్పుడన్నా తినాలని చూస్తే, తాము వారిస్తామని చెల్లెలు నూతన్ గవాస్కర్ ఆ ట్వీట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News