: ఐదు రోజుల్లో 200 కోట్లు వసూలు చేసిన 'సుల్తాన్'


'దబాంగ్' సినిమాతో వంద కోట్ల క్లబ్ లో మెంబర్ అనిపించుకున్న సల్మాన్ ఖాన్, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సల్మాన్ కు ఉన్న మాస్ ఇమేజ్ అతని సినిమాలను అవలీలగా వంద కోట్ల మార్కును దాటించేస్తోంది. కాగా, తాజాగా విడుదలైన సల్మాన్ 'సుల్తాన్' రికార్డుల దిశగా దూసుకుపోతోంది. 'భజరంగీ భాయ్ జాన్' సినిమాతో 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సల్లూ భాయ్, 'సుల్తాన్' తో దానిని దాటేయనున్నాడు. కేవలం తొలి ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం విశేషం. ఈద్ సందర్భంగా విడుదలైన 'సుల్తాన్'కు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పర్వం మొదలైంది. దీంతో ఇది తొలి వారంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసిందని బాలీవుడ్ వసూళ్ల విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News