: నాకు రెండు అంశాలంటే చాలా ఇష్టం: అల్లు అర్జున్‌


టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈరోజు హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని త‌న ఇంటి వ‌ద్ద హ‌రితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ‘మొక్క‌లు నాటే అంశం నా కొడుకు జ‌న‌రేష‌న్‌కే చాలా ముఖ్యం’ అని అన్నారు. అందుకే త‌న కుమారుడితో క‌లిసి మొక్క‌ను నాటిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ‘మ‌నం ఏ పనులు చేస్తే అవే ప‌నులు మ‌న‌ పిల్ల‌లు కూడా చేస్తారు’ అని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం చేస్తోన్న ఈ మంచి కార్యక్ర‌మం ప్ర‌జ‌ల్లోకి బాగా వెళుతోంద‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి ఈ అంశంలో స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు అల్లు అర్జున్ తెలిపారు. ‘ఇది ప్ర‌జ‌లంద‌రికీ సంబంధించిన విష‌యం. ఏ రాజ‌కీయ పార్టీ కార్య‌క్ర‌మ‌మో కాదు’ అని అన్నారు. ‘నాకు రెండు అంశాలు అంటే చాలా ఇష్టం. ఒక‌టి మొక్క‌లు నాట‌డం.. రెండోది పిల్ల‌లంద‌రూ చ‌దువుకోవాల‌నే అంశం’ అని బన్నీ అన్నారు.

  • Loading...

More Telugu News