: వాహన పత్రాలు చూపించమన్నందుకు... చిత్తూరులో టీడీపీ నేత వీరంగం!
చిత్తూరులో ఒక టీడీపీ నేత వీరంగం వేశాడు. నగర పోలీసులు ఈరోజు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ నేత మనోహర్ నాయుడు వాహనాన్ని కూడా పోలీసులు ఆపారు. సంబంధిత పత్రాలు చూపించాలని ఆయన్ని కోరారు. దీంతో, సదరు నేత రెచ్చిపోయి.. పోలీసులపై మండిపడ్డారు. ఊహించని ఆ సంఘటనతో పోలీసులు కంగుతిన్నారు. తన వాహనాన్ని రోడ్డుపైనే ఆపేసి అక్కడ నుంచి ఆ నేత వెళ్లిపోయాడు. దీంతో, ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు.