: రమ్య మృతి కేసు.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం: సీపీ మహేందర్ రెడ్డి

చిన్నారి రమ్య మృతి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని వెస్ట్ జోన్ డీసీసీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 1న జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారి రమ్య, రాజేష్ మరణించడం చాలా దురదృష్టకరమన్నారు. నిందితుడికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, మద్యం సేవించడం, సీసీ టీవీ ఫుటేజీ వంటి ముఖ్యమైన ఆధారాలపై దృష్టి పెట్టామని చెప్పారు. వాహనం నడిపిన మైనర్ శ్రావిల్ అనే వ్యక్తికి లైసెన్స్ లేకపోవడమే కాకుండా మద్యం సేవించి ఉండటాన్ని గుర్తించి అతన్ని అరెస్టు చేశామన్నారు. నిందితుడు శ్రావిల్ నడిపిన కారు, విష్ణు అనే మరో విద్యార్థిదన్నారు. నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకుని లోతైన విచారణ చేస్తామని, మైనర్లకు మద్యం అమ్మిన బార్ యజమానిపై చర్యలు తీసుకోవాలని, బార్ లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్ కమిషనర్ కు లేఖ రాశామన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారని, వీరందరూ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు.

More Telugu News