: దక్షిణాఫ్రికా నుంచి టాంజానియా చేరుకున్న మోదీ
ఆఫ్రికా దేశాలతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే చర్యలలో భాగంగా ఐదు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ టాంజానియా చేరుకున్నారు. ప్రధాని తొలుత మొజాంబిక్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో పర్యటించిన మోదీ ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా శనివారం రాత్రి టాంజానియాలో అడుగుపెట్టారు. టాంజానియా ప్రధాని కాసిం మజలివా, విదేశీ వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ మెంబిక్ విమానాశ్రయంలో మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆ దేశ అధ్యక్షుడు జాన్ పోంబె జోసెఫ్ మగుఫులితో మోదీ చర్చలు జరపనున్నట్టు భాతర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.