: కశ్మీర్ లో తీవ్రమైన ఆందోళనలు...భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది మృతి

హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌ కౌంటర్‌ జమ్మూకశ్మీర్‌ లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన యువకులు పోలీసు పోస్ట్‌ లు, భద్రతా సిబ్బందిపై దాడులకు దిగారు. మూడు పోలీసు స్టేషన్లకు నిప్పు పెట్టారు. దీంతో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పది మంది ఆందోళనకారులు తుపాకీ తూటాలకు నేలకొరిగారు. మరో 66 మంది గాయపడ్డారు. ఆందోళనలు కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు.

More Telugu News