: ఫేస్ బుక్, గూగుల్ సీఈవోలు అయిపోయారు... ఇప్పుడు ట్విట్టర్ సీఈవో వంతు... ఆయన అకౌంట్ కూడా హ్యాక్ అయింది!


ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ల సోషల్ మీడియా అకౌంట్లను 'అవర్ మైన్ గ్రూప్' హ్యాక్ చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను కూడా హ్యాక్ చేశారు. అనంతరం తాము హ్యాక్ చేసినట్టుగా అదే అకౌంటులో అవర్ మైన్ గ్రూప్ ప్రకటించింది. కాగా, జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్టు ఆయన ఫాలోవర్స్ 3.73 మిలియన్ల మందికి తెలిపింది. వెంటనే స్పందించిన ట్విట్టర్ సిబ్బంది ఆయన అకౌంటును పునరుద్ధరించి, ఆ ట్వీట్ ను తొలగించారు. అయితే ఇలా హ్యాక్ చేయడం ద్వారా తాము చౌర్యానికి పాల్పడడం లేదని, ఆయా సేవల్లో లోపాలు తెలపడమే తమ ఉద్దేశ్యమని 'అవర్ మైన్ గ్రూప్' చెబుతోంది. అవర్ మైన్ గ్రూప్ సైబర్ భద్రతా సంస్థ అని, ఎలాంటి లోపాలు లేని సేవలందించడమే తమ లక్ష్యమని, వివిధ భద్రతా సేవలను తాము అందిస్తున్నామని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News