: కాంగ్రెస్ కు స్థలమెందుకివ్వాలన్న మంత్రులు!... అందరికీ ఎంతో కొంత ఇద్దామన్న చంద్రబాబు!

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో భూముల కేటాయింపునకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. పలు ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు కూడా ఇప్పటికే భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపుపై రసవత్తర చర్చ జరిగింది. అసెంబ్లీలో అసలు ప్రాతినిధ్యమే లేని కాంగ్రెస్ పార్టీకి భూమి ఎందుకివ్వాలని కొందరు మంత్రులు కొత్త వాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి భూమి ఇవ్వొద్దనుకుంటే... అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలకు కేటాయించట్లేదన్న ఒక్క నిబంధన పెడితే సరిపోతుందని వారు వాదించారు. మంత్రుల వాదనను సావధానంగా విన్న చంద్రబాబు... వారి వాదనతో విభేదించారు. రాజకీయ పార్టీలుగా ఉన్న అన్ని పార్టీలకు ఎంతో కొంత భూమి ఇచ్చేస్తే సరిపోతుందని ఆయన తేల్చి చెప్పారు.

More Telugu News