: భవిష్యత్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు టీవీ అవార్డ్స్ కార్యక్రమం: టి.సుబ్బరామిరెడ్డి


హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో టి.సుబ్బరామిరెడ్డి కళాపరిషత్ టీవీ అవార్డ్స్ కార్యక్రమం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, తాను పలు భాషల్లో సినిమాలు తీశానని, అయితే, టీవీని అభిమానించినప్పుడే సరైన న్యాయం జరుగుతుందని తాను నమ్ముతానని, అందుకే, ఈ టీవీ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పారు. టీవీ స్టార్స్ కి అవార్డులిస్తామంటే, వారు స్టైల్ గా, ఆలస్యంగా కార్యక్రమానికి వస్తారని, అది తనకు నచ్చదని, అయితే, ఈసారి కరెక్టు సమయానికే వచ్చారని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. టీవీ స్టార్స్ ఇదే పంక్చువాలిటీ అనుసరిస్తే కనుక, భవిష్యత్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు టీవీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తానని సుబ్బరామిరెడ్డి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News