: కెప్టెన్సీ వదులుకుందామని చాలాసార్లు అనుకున్నాను... ఇప్పటికీ వదులుకోలేకపోతున్నాను: ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్
చాలా సార్లు కెప్టెన్సీ వదులుకుందామనిపించిందని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలు భారమని పేర్కొన్నాడు. ప్రధాన టోర్నీల్లో జట్టు విఫలమైన ప్రతిసారి కెప్టెన్సీ వదులుకుందామనిపించిందని అన్నాడు. అలా అనిపించిన ప్రతిసారీ తన భార్య అలైస్ కు చెప్పానని వెల్లడించాడు. అయితే కొన్ని బలమైన కారణాల వల్ల కెప్టెన్సీ నుంచి బయటకు రాలేకపోయానని కుక్ పేర్కొన్నాడు. 2012లో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అలిస్టర్ కుక్ 2013-14లో జరిగిన యాషెస్ సిరీస్ లో జట్టు పూర్తిగా విఫలం కావడంతో కెప్టెన్సీ వదులుకుందామని తొలిసారి భావించానని చెప్పాడు. 2015లో కివీస్ తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా కూడా కెప్టెన్సీ నుంచి వైదొలగాలని భావించానని అన్నాడు. అదే ఏడాది యాషెస్ సిరీస్ లో కెప్టెన్ గా బరిలో దిగకూడదని భావించానని, అయితే కెప్టెన్ గా కొనసాగక తప్పలేదని అన్నాడు. ఈ యాషెస్ ను ఇంగ్లండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.