: 'విమానం కార్ల' తయారీకి పోటీ పడుతున్న కంపెనీలు!


శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిపుణులు దూసుకుపోతున్నారు. రోజుకో ఆవిష్కరణతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో విమానం కార్లు తయారు చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. అసలు 'విమానం కార్లు' అన్న పేరే వినడానికి కొత్తగా ఉంది కదా...రోడ్డుపై ప్రయాణించడానికి, గాల్లో ఎగరడానికి అనువుగా ఉన్న కార్లను విమానం కార్లు అంటారు. రెక్కల కారును తొలిసారి అమెరికాకు చెందిన ఎయిరోమోబిల్ సంస్థ గత ఏడాది తయారు చేసింది. ఇది రోడ్డుపై రివ్వున దూసుకుపోతూ... అవసరమైనప్పుడు గాల్లోకి తుర్రున ఎగిరిపోయే కారు. ఇప్పుడు అదే దేశానికి చెందిన మరో సంస్థ టెర్రాఫ్యూజియా అలాంటి కారునే రూపొందించి విజయం సాధించింది. దీనికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది కూడా. దీంతో ఈ కారు రోడ్డు మీద సాగిపోతూ, గాల్లో ఎగిరిపోయి అందర్నీ అబ్బురపరిచింది. ఈ కారు సాధించిన విజయంతో భవిష్యత్ లో గాల్లో ఎగిరే కార్లను చూడవచ్చన్నమాట.

  • Loading...

More Telugu News