: ముగిసిన రణవీర్, దీపిక నిశ్చితార్థం? ... పెదవి విప్పని జంట!
బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ల నిశ్చితార్థం దగ్గరి బంధువులు, సన్నిహితుల సమక్షంలో అయిపోయిందన్న ఓ వార్త ఉత్తరాదిన హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారని, ఇక వివాహ తేదీ నిర్ణయమే తరువాయని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఇద్దరి చేతినిండా పలు సినీ ప్రాజెక్టులు ఉండటంతో, పెళ్లికి మాత్రం మరింత సమయం పడుతుందని సమాచారం. కెరీర్ పీక్ దశలో ఉన్న తరుణంలో వివాహబంధం తమ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించవచ్చని అటు రణవీర్, ఇటు దీపికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో ఇద్దరికిద్దరూ నోరు మెదపట్లేదు. ఎంగేజ్ మెంట్ జరిగిపోయినట్టు వస్తున్న వార్తలపై ఈ 'బాజీరావ్ మస్తానీ' జంట ఏమంటుందో?