: చైనాలో దూసుకొస్తున్న తుపాను ‘నెపార్టక్’
చైనాను ఓ వైపు వరదలు అతలాకుతలం చేస్తుంటే మరోవైపు టైఫూన్ ‘నెపార్టక్’ రూపంలో మరో విపత్తు ముంచుకొస్తోంది. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విపత్తు నిర్వహణ అధికారులను అప్రమత్తం చేసింది. గతకొన్ని వారాలుగా చైనాను భారీ వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 168 మంది చనిపోగా, 28 మంది కనిపించకుండా పోయారు. కాగా రేపు ఉదయం నాటికి నెపార్టక్ టైపూన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న చైనాను ఇది మరింత భయపెడుతోంది. వరదల కారణంగా చైనాలోని పలు ప్రావిన్సులు పూర్తిగా జలమయమయ్యాయి. సహాయకార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.