: విరాట్ తో పోలికా... నేను జీరోయే!: బ్యాడ్మింటన్ స్టార్ సైనా
ఆటలో ఓడిపోవడం అంటే తనకు ఇష్టం ఉండదని, తన మనస్తత్వమే దూకుడుగా ఆడే అలవాటుకు కారణం అయి ఉండవచ్చని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. ఇక సైనా దూకుడును క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలుస్తున్న అభిమానుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో... విరాట్ కోహ్లీ మైదానంలో చూపే దూకుడుతో పోలిస్తే, తాను జీరోయేనని చెప్పింది. ఒలింపిక్స్ పోటీల కోసం కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో కఠోర శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒలింపిక్స్ డ్రా చూసిన తరువాతనే తన వ్యూహాన్ని నిర్ణయించుకుంటానని చెప్పింది. బరిలోకి దిగిన తరువాత ఆటపై ఆశలు వదులుకోబోనని, చివరి వరకూ పోరాడతానని చెప్పిన సైనా, కోహ్లీ తన ఆటతీరును మెచ్చుకోవడాన్ని గుర్తు చేసుకుంటూ, కోహ్లీ ఆటతీరు తనకు ఎంతో ఇష్టమని చెప్పింది.