: ఐఎస్ఐఎస్ వీడియోలో బంగ్లా టాప్ మోడల్ మాజీ భర్త!


బంగ్లాదేశ్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ విడుదల చేసిన వీడియోలో బంగ్లాదేశ్ టాప్ మోడల్ నైలా నయెమ్ మాజీ భర్త తుషార్ ఉండడం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ మేజర్ వషీకుర్ ఆజాద్ కుమారుడైన తుషార్ దంత వైద్యుడు. ఢాకాలోని బరిదర డిఫెన్స్ ఆఫీర్స్ హౌసింగ్ కాలనీలో నివాసముండేవాడు. 2011లో నైలా నయెమ్ తో తుషార్ కు వివాహం జరిగింది. తరువాత ఆ మతంలో ఉన్న తలాక్ సౌలభ్యాన్ని వినియోగించుకుని వారిద్దరూ విడిపోయారు. గత రెండేళ్లుగా కనిపించకుండాపోయిన తుషార్ హోలీ బెస్ట్ బేకరిలో నరమేధం అనంతరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలో కనిపించడంతో బంగ్లా ప్రభుత్వ వర్గాలు నివ్వెరపోయాయి. ఈ దాడిని ప్రశంసిస్తూ ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బంగ్లా భాషలో మాట్లాడారు. పనిలో పనిగా 'అంతం కాదిది అరంభం' అంటూ భారీ డైలాగు కొట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. పెరిగిన గడ్డంతో కనిపించిన తుషార్ తో పాటు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థి త్వాసిఫ్ హుస్సేన్ కూడా ఈ ముగ్గురిలో వున్నాడు. ఇతనిని గతంలో జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) తో సంబంధాలున్నాయనే ఆరోపణతో అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం అతడిని తల్లిదండ్రులు ఆస్ట్రియాకు పంపించగా సిరియా వెళ్లి ఉగ్రవాదిగా మారాడు. మూడో వ్యక్తిని తమీమ్ రహ్మాన్ షఫీగా గుర్తించారు. ఈ వీడియోను సిరియా రాజధాని అల్-రఖాలో రికార్డు చేసినట్టు ఐఎస్ఐఎస్ తెలిపింది.

  • Loading...

More Telugu News