: ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఒబామా...సోషల్ మీడియాలో ఫొటోలు హల్ చల్
అమెరికాలో ముస్లింలకు సంబంధించిన ఏ వార్త అయినా ఆసక్తికరమే... ఆ వార్త దేశాధ్యక్షుడితో ముడిపడి వున్నదైతే దాని పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. అలాంటి వార్తను ఫోటోలతో పాటు ఫాక్స్ న్యూస్ ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 90వ దశకంలో కుర్రవాడిగా ఉండగా తీసుకున్న ఫొటోలను ఫాక్స్ న్యూస్ బహిర్గతం చేసింది. ఈ ఫొటోల్లో బరాక్ ఒబామా ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో, టోపీ ధరించి ఉన్నారు. మేరీలాండ్ లో తన సోదరుడు మాలిక్ వివాహం సందర్భంగా ఒబామా ఈ ఫొటోలు దిగినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది. కాగా, ఒబామాలో కెన్యా ముస్లిం మూలాలున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.