: రూ. 9,900కు 32 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టీవీ: ఆవిష్కరించిన రింగింగ్ బెల్స్


ముందుగా ప్రకటించినట్టుగానే, హై డెఫినిషన్ ఎల్ఈడీ టీవీల రంగంలో విప్లవాత్మక మార్పును తెచ్చేలా 31.5 అంగుళాల టీవీని రింగింగ్ బెల్స్ ఆవిష్కరించింది. గతంలో తాము విడుదల చేసిన రూ. 251 స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251 డెలివరీలు రేపటి నుంచి ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ మోహిత్ గోయల్ వెల్లడించారు. కొద్ది సేపటి క్రితం న్యూఢిల్లీలో ఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఎల్ఈడీ టీవీతో పాటే మూడు రకాల ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను కూడా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తాము విడి భాగాలను తెచ్చి వాటితో ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, అన్ని ఖర్చులనూ లెక్కించిన తరువాతనే ధరలను నిర్ణయిస్తున్నామని ఆయన అన్నారు. హిట్, కింగ్, బాస్, రాజా పేరిట నాలుగు ఫీచర్ ఫోన్లను రూ. 699 నుంచి రూ. 1099 ధరల మధ్య, ఎలిగెంట్ 3జీ ఫోన్ ను రూ. 3,999కు, ఎలిగెంట్ 4జీ ఫోన్ ను రూ. 4,999కు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎల్ఈడీ టీవీల డెలివరీని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News