: ధోనీ పుట్టినరోజు కానుకగా సినిమా పోస్టర్ విడుదల


టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ 35వ పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన జీవిత కథాంశంతో రూపొందించిన ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం పోస్టర్ ను అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ధోనీ పాత్ర పోషిస్తున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కెప్టెన్, లీడర్, విన్నర్.. ఇలా ఎన్నో పేర్లు సంపాదించుకున్న ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుశాంత్ తో పాటు కియరా అద్వానీ, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు.

  • Loading...

More Telugu News