: ‘సిమ్రాన్’గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్


బాలీవుడ్ అందాల భామ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘సిమ్రాన్’. కంగనా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ ఫస్ట్ లుక్ లో హౌస్ కీపర్ గెటప్ లో కనిపిస్తున్న కంగనా సింపుల్ గా ఉంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా నెగిటివ్ పాత్ర పోషిస్తోందని, ఊహించని పరిస్థితుల్లో ఒక మహిళ నేర ప్రపంచంలోకి ఎలా చేరిందనే కథాంశంతో ‘సిమ్రాన్’ని రూపొందిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

  • Loading...

More Telugu News