: చంద్రబాబు మాట్లాడుతున్న వేళ 'బావలు సయ్యా' పాట!
వెలగపూడి సచివాలయం వద్ద చంద్రబాబు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న వేళ మైకుల్లో "బావలు సయ్యా..." పాట పెద్దగా వినిపిస్తుండటం ఆయనకు అసహనాన్ని కలిగించింది. గవర్నర్ నరసింహన్ తో కలసి వెలగపూడికి వచ్చిన ఆయన, భవనాల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకుని, వేద పండితులను, మేళతాళాలను, మైక్ సెట్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ మైక్ సెట్ నుంచే ఈ పాట వినిపించినట్టు తెలుస్తోంది. సీఎం ప్రసంగానికి అడ్డుతగులుతున్న పాటలను ఆపాలని అధికారులు పదే పదే కోరాల్సి వచ్చింది. సీఎం ప్రసంగాన్ని లైవ్ చూపిస్తున్న పలు చానళ్లు ఈ పాట వస్తుండటంతో సౌండును 'మ్యూట్' చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.