: బ్రెగ్జిట్ దెబ్బ... బ్రిటన్ స్థానాన్ని ఆక్రమించిన ఫ్రాన్స్


ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఫ్రాన్స్ అవతరించింది. నిన్నటి వరకూ ఈ స్థానంలో నిలిచిన బ్రిటన్ ను ఫ్రాన్స్ అధిగమించింది. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగాలన్న నిర్ణయంతో బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా పడిపోగా, ఆ ప్రభావం ఎకానమీని కుదించివేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా గణాంకాల మేరకు 2015లో బ్రిటన్ స్థూలజాతీయోత్పత్తి 1.864 ట్రిలియన్ పౌండ్లుగా ఉంది. ఇదే యూరోల్లో అయితే 2.172 ట్రిలియన్లు. ఇక ఫ్రాన్స్ ఎకానమీ విలువ 2.182 ట్రిలియన్ యూరోలుగా ఉంది. జూన్ 23న యూకే వాసుల్లో అత్యధికులు బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటేసిన సంగతి తెలిసిందే. పౌండ్ విలువ తిరిగి పెరగడం ప్రారంభమైతే బ్రిటన్ తిరిగి టాప్-5 ఆర్థిక వ్యవస్థల్లో చేరడం ఖాయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News