: అఖిల్ ను ఆటపట్టించిన రానా!
సినీ నటుడు అఖిల్ అక్కినేని ప్రేమ, పెళ్లి విషయాలు తెలుగు మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ మధ్యే నాగార్జున స్పందించాడంటూ వార్తలు కూడా వెలువడ్డాయి. తాజాగా అఖిల్ బావ రానా దగ్గుబాటి అతనిని ఆటపట్టించాడు. ఇటీవల జరిగిన సైమా అవార్డుల కార్యక్రమంలో ఈ ముచ్చట చోటుచేసుకుంది. ఈ వేడుకలో అఖిల్ కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డు వచ్చింది. దీనిని అందుకునేందుకు స్టేజ్ ఎక్కిన అఖిల్ ను రానా ఆటపట్టిస్తూ, 'నీ ఏజ్ ఎంత బంగారం?' అని అడిగాడు. దీంతో వెంటనే తన వయసు చెప్పేందుకు ఇబ్బంది పడ్డ అఖిల్ ఓ క్షణం ఆగి, '22' అని చెప్పాడు. 'నా వయసు 32... నేనే ఇంతవరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. పెళ్లి చేసుకున్న బన్నీ ఇప్పటికే ఫ్రెండ్స్ ని మర్చిపోయాడు... నువ్వూ అంతేనా?' అని అడిగాడు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని అఖిల్ ముసిముసినవ్వులు నవ్వేశాడు.