: పేరు ప్రఖ్యాతులు వద్దు...సమాచారమివ్వండి చాలు... ఇక నేను చూసుకుంటాను!: రష్యాను ఊపేస్తున్న రియల్ లైఫ్ 'బ్యాట్ మ్యాన్'


డ్రగ్ ఏజెంట్లు సమావేశం పెట్టుకుంటారు. అక్కడికి ముసుగు ధరించిన వ్యక్తి వస్తాడు. అందర్నీ ఇరగదీసి, మత్తుపదార్థాలను నాశనం చేసి అక్కడి నుంచి జారుకుంటాడు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుని వెళ్లిపోతారు. ఇది హాలీవుడ్ లో విడుదలైన ప్రతి సూపర్ హీరో సినిమాలోను కనిపించే రెగ్యులర్ ఎపిసోడ్... ఇది రియల్ గా చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? రష్యాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముసుగు ధరించిన అపరిచితుడు మాస్కో శివారుల్లోని కిమ్కి ప్రాంతంలోని ఓ డ్రగ్ డెన్ లోకి వెళ్లాడు. అందులో ఉన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను చితకబాదాడు. అనంతరం తాపీగా బయకువచ్చి ఓ పొగబాంబు అక్కడ వేసి మాయమయ్యాడు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకోగా, ఈ ఘటన గురించి అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ సవివరంగా తెలిపాడు. దీంతో ఇప్పుడతను అక్కడ పాప్యులర్ అయిపోయాడు. అయితే ఆ ముసుగు వ్యక్తి తానెవరన్నది తెలపకపోయినా...ట్విట్టర్ లో 'రీపర్... మానవత్వానికి మొదటి హీరో'గా పేర్కొన్నాడు. దీంతో ఇతని గురించిన ఆధారాల కోసం పరిశోధన చేసిన ఓ పత్రిక అతనెవరన్నది కనుక్కోలేకపోయినప్పటికీ అతను పోలీసులకు రాసిన లేఖను పట్టేసింది. ఆ లేఖలో రీపర్ ఏం రాశాడంటే...'సమాజంలో డ్రగ్స్ కేన్సర్ లా పెరిగిపోతున్నాయి. వీటిని అంతం చేయాల్సిన అవసరం ఉంది...నేరసామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసేందుకు నాకు మీ సాయం కావాలి. నన్ను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం ఎవరికీ లేదు' అని చెబుతూ, సోషల్ మీడియా ద్వారా తనకు సమాచారం అందించాలన్నాడు. తాను పోలీసులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన రీపర్, వారి చేతులు బంధించి ఉన్నాయని తనకు తెలుసని, సహచరులు, నేరగాళ్ల వల్ల మీరు (పోలీసులు) ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాలకు కనీసం వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నాడు. అలా వెళ్లలేని, పట్టుకోలేని స్థావరాల గురించి తనకు చెప్పాలని కోరాడు. అక్కడకి తాను వెళ్లగలనని తెలిపాడు. వారి వ్యవస్థలను సమూలంగా నాశనం చేస్తాననని రీపర్ శపథం చేశాడు. ఇలా చేస్తున్నందుకు తనకు పేరు ప్రఖ్యాతులు అసవరం లేదని స్పష్టం చేశాడు. అయితే సమాచారం మాత్రం ఇవ్వండని కోరాడు. నేరగాళ్లు, రేపిస్టులు, డ్రగ్స్ మాఫియాదారులకు సంబంధించిన సమాచారం తనకు అందజేయాలని తన ట్విట్టర్ పేజ్ లో తెలిపాడు. దీంతో ఈ అపరిచితుడు రష్యాలో సూపర్ హీరో స్థాయిలో ఆదరణ పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News