: అత్యాచారం విషయంలో అబద్ధమాడిన జర్మన్ రాజకీయవేత్త!
జర్మనీ యువ రాజకీయవేత్త సెలిన్ గోరెన్ (25) గత జనవరిలో రేప్ కు గురయ్యారు. ఆమె జర్మనీలో వలస బాధితుల కోసం పోరాటం చేస్తున్నారు. గత జనవరిలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆమె ఏ వలసదారుల కోసమైతే పోరాటం చేస్తున్నారో...వారి చేతిలోనే దారుణంగా అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను లాక్కెళ్లిన దుండగులు, ఆమెను దారుణంగా బలాత్కరించారు. దారుణం జరిగిన అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఆమె తనపై జర్మన్లే అత్యాచారం చేశారని తప్పుడు ఫిర్యాదు చేశారు. నిజానికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డవారు అరబిక్, పార్సీ భాషలను మాట్లాడినట్టు ఆమె అప్పుడే గుర్తించారు. అయినప్పటికీ ఆమె తప్పుడు ఫిర్యాదు చేయడం విశేషం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వలసదారులపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే తాను అలా చెప్పినట్టు ఆమె తాజాగా తెలిపారు. జాతివివక్షతో కూడిన వ్యతిరేకతను దూరం చేయడానికే ఆ సమయంలో అలా అబద్ధం చెప్పానని ఆమె తెలిపింది. ఈ విషయం తెలిసిన అనంతరం వలస బాధితుల కోసం పోరాడుతున్న సెలిన్ ను అత్యాచారం చేసినవారికి జర్మనీ ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉందా? అనే వాదన పెరుగుతోంది.