: సల్మాన్ కూ తప్పని ‘పైరసీ’ దెబ్బ!... విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీకైన ‘సుల్తాన్’!


పైరసీ భూతం భారత చలన చిత్ర రంగాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలు భాషలకు చెందిన భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. వెరసి ఆయా చిత్రాల నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు నటించిన తాజా చిత్రం ‘సుల్తాన్’ నేటి ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా ఈద్ రోజే విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మరింత జోష్ ను పెంచింది. అయితే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆన్ లైన్ ఎడిషన్ లో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం ఈ చిత్రం విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీకైపోయింది. విడుదలకు ఓ రోజు ముందే ఈ చిత్రం ఆన్ లైన్ లో లీకైందని ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ‘డార్క్ నెట్’ లో ఉన్న ఈ చిత్రం కాపీ త్వరలోనే ‘టోరెంట్’ లోనూ ప్రత్యక్షం కానుందని ఆ కథనం తెలిపింది. అయితే ఈ వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ ‘యశ్ రాజ్ ఫిల్మ్స్’ ఖండించింది.

  • Loading...

More Telugu News