: సల్మాన్ కి సలహా ఇచ్చేందుకు నేనెవర్ని?: అమీర్ ఖాన్
సల్మాన్ ఖాన్ కు సలహా ఇచ్చేందుకు తానెవరినని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మీడియాను ప్రశ్నించాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఖాన్ ను సల్మాన్ రేప్ వ్యాఖ్యల వివాదంపై స్పందించాలని మీడియా కోరింది. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ, సల్మాన్ అలా వ్యాఖ్యానించినప్పుడు తాను అక్కడ లేనని చెప్పాడు. అయితే మీడియాలో చదివిన దాని బట్టి సల్మాన్ అలా వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదని అన్నాడు. సల్మాన్ తో ఈమధ్య కాలంలో మాట్లాడలేదని, అయినా సరే ఇలాంటి విషయాల్లో ఆయనకు సలహా ఇచ్చేందుకు తానెవరినని అమీర్ ప్రశ్నించాడు. కాగా, ఈ వివాదంలో జాతీయ మహిళా కమిషన్ ముందు ఈ నెల 8న సల్మాన్ హాజరుకానున్న సంగతి తెలిసిందే.