: ఇలాంటి వారిని ఏ ముస్లింలు అని అనాలి?: బంగ్లాదేశ్ ప్రధాని
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈరోజు జరిగిన ఉగ్రదాడిలో 20 మంది పౌరులు మృతి చెందారు. తమ దేశంలో జరిగిన ఉగ్రదాడిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. దాడులు చేస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్న వారిని ఏమనాలి..? అని ఆమె ప్రశ్నించారు. ఉగ్రవాదులకు మతమంటూ లేదు అని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి వారిని ఏ ముస్లింలు అని అనాలి? ఉగ్రవాదమే వారి మతం ’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిర్వహించే ప్రార్థనలను సైతం పక్కకు పెట్టేసి ప్రజలను చంపడానికి సిద్ధపడడమేంటని హసీనా ప్రశ్నించారు. ఉగ్రదాడి సహించరాని చర్య అని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే క్రమంలో ప్రపంచ దేశాలతో తాము కృషి చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల చర్య నీచమైనదిగా పేర్కొన్నారు.