: చైనాపై తైవాన్ క్షిపణి ప్రయోగం... పొరపాటు జరిగిందంటున్న అధ్యక్షుడు
చైనా పై తైవాన్ దేశం ప్రయోగించిన క్షిపణి ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. కాసియాంగ్ నేవీ బేస్ నుంచి ప్రయోగించిన షుంగ్ ఫెంగ్ త్రీ యాంటీ షిప్ పేరుతో పిలవబడే ఈ క్షిపణి రేంజ్ 300 కిలోమీటర్లు. చైనాలోని పెంగు వద్ద ఈ క్షిపణి పడటంతో ఒకరు చనిపోగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై చైనా మండిపడుతోంది. త్రివిధ దళాల అధినేత కూడా అయిన తైవాన్ అధ్యక్షుడు ఈ విషయమై స్పందిస్తూ పొరపాటున ఇలా జరిగిందన్నారు. మరోపక్క, ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ సంఘటనపై చైనా మాత్రం మండిపడుతోంది.