: మాదాపూర్ లో సందడి చేసిన రెజీనా


హైదరాబాదులోని ఐటీ కేంద్రం మాదాపూర్ లో సినీ నటి రెజీనా సందడి చేసింది. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పారా బాడ్మింటన్‌ లో విజయం సాధించిన క్రీడాకారుల సన్మాన కార్యక్రమాన్ని మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, క్రీడా రంగంలో రాణిస్తున్న వికలాంగులకు చేయూత అందిస్తున్న ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ కృషి అభినందనీయమని అన్నారు. శారీరక సామర్థ్యం లేకున్నా అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదలతో విజయాలు సాధించిన ఆటగాళ్లను ఆమె అభినందించారు. సమాజానికి స్పూర్తిగా నిలిచారని ఆమె కొనియాడారు.

  • Loading...

More Telugu News