: త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ పంచ్ లు బాగుంటాయి... ‘పూరీ’ ఈ మధ్య ట్రాక్ తప్పాడు : కోదండరామిరెడ్డి


‘నాకు త్రివిక్రమ్ శ్రీనివాసంటే ఇష్టం. ఎందుకంటే, అతని డైలాగ్ పంచ్, చెప్పే విధానం కొత్తగానే కాకుండా చాలా బాగుంటాయి. అతను రైటర్ కాక ముందు నుంచే నాకు తెలుసు’ అని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. పూరీ జగన్నాథ్ కూడా మంచి దర్శకుడని, డైలాగ్ లు బాగా రాస్తాడని చెప్పారు. అయితే, ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పాడనిపిస్తోందని, ఈ మధ్య కలిసినప్పుడు పూరీతో ఈ విషయాన్ని తాను ప్రస్తావించానని, మళ్లీ పాతరోజులు జ్ఞాపకం తెచ్చుకోమని, మంచి దర్శకుడివని చెప్పానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News