: ఎన్టీఆర్ తో సినిమా తీయలేకపోయాను... శ్రీదేవి చాలా మంది బాలీవుడ్ ప్రొడ్యూసర్లను నా దగ్గరకు పంపించేది: కోదండరామిరెడ్డి
చిత్రరంగంలో తాను బిజీగా ఉండటం కారణంగా అనుకున్నవి చేయలేకపోయానని, వాటిలో ఎన్టీఆర్ తో సినిమా చేయలేకపోవడం ఒకటని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. అలాగే హిందీ సినిమాలు చేయమంటూ నటి శ్రీదేవి తన దగ్గరకు చాలామంది ప్రొడ్యూసర్లను పంపించిందని, ఎందుకో అది కూడా కుదరలేదని ఆయన అలనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’, ‘శ్రీరంగనీతులు’, ‘ఛాలెంజ్’ ఇలా చాలా చిత్రాలను హిందీలో తీద్దామంటూ శ్రీదేవి అడిగేదని, తానే చేయలేకపోవడం బాధగా అనిపిస్తుందని అన్నారు. బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ నుంచి కూడా సినిమా చేద్దామని తనకు ఫోన్ వచ్చిందని, అయినా చేయలేకపోయానని అన్నారు. చాలా బిజీగా ఉండటం, భాషా సమస్య కారణంగా హిందీలో చిత్రాలు తీయలేకపోయానని చెప్పారు.