: సారీ... విలన్ పాత్రల జోలికి వెళ్లను: హీరో సల్మాన్ ఖాన్
విలన్ పాత్రలను తాను ఎట్టి పరిస్థితుల్లోను చేయనని, ఆ పాత్రల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. నిజజీవితంలో ఎలాగూ హీరోయిజం చూపించలేమని, కనీసం తెరపైన అయినా హీరోయిజం చూపించే ఆస్కారం ఉండాలంటే హీరో పాత్రలే చేయాలని సల్మాన్ తన మనసులో మాట చెప్పాడు. హీరో పాత్రలో మంచి చేసే గుణం ఉంటుందని, ముఖ్యంగా సినిమా చూసి వెళ్లే ప్రేక్షకులు నవ్వుతూ, సంతోషంగా ఇంటికి వెళ్లాలని, అందుకే, హీరో పాత్రలే తాను చేస్తానని చెప్పాడు.