: హాలీవుడ్ జంట బ్రేకప్ పై చైనాలో భారీ బెట్టింగులు!
హాలీవుడ్ నటుల్లో ప్రేమలు, పెళ్లిళ్లు సర్వ సాధారణం. ఇట్టే కలుస్తారు, అంతలోనే విడిపోతారు. ఈ క్రమంలో అమెరికన్ నటి, పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, బ్రిటిష్ నటుడు టామ్ హిడెల్ స్టాన్ ప్రేమలో మునిగితేలుతున్నారని హాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. వీరి ప్రేమాయణం ప్రారంభమై కొన్నాళ్లు కూడా కాకుండానే, ఈ జంట ఎప్పుడు విడిపోతారనే విషయంపై ఇప్పుడు జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. గతంలో చాలా మందితో జత కట్టిన టేలర్ స్విఫ్ట్ ఇతనితో కూడా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని చెబుతూ చైనాకు చెందిన ప్రముఖ బెట్టింగ్ వెబ్ సైట్ టావోబావో.కామ్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఇందులో భారీ సంఖ్యలో బెట్టింగులు కాశారని తెలుస్తోంది. ఈ బెట్టింగులపై ఇన్సూరెన్స్ పాలసీలు ప్రారంభించిందని సమాచారం. దీంతో ఈ బెట్టింగులను చైనా ప్రభుత్వం నిషేధించింది.