: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 40 మంది పోలీసులు మృతి
ఉగ్రవాదుల దాడులతో ప్రపంచం వణికిపోతోంది. ప్రతీరోజు ఏదో ఓ చోట ఉగ్రవాదులు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉగ్రవాదులు పోలీసులపై దాడి జరిపారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లో భయానక వాతావరణం సృష్టించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడి జరిపి ముష్కరులు అలజడి రేపారు. పోలీసుల వాహనశ్రేణిపై ఆత్మాహుతి దాడి చేశారు. ముష్కరుల చర్యతో 40 మంది పోలీసులు మృతి చెందారు. అనంతరం ‘కాబూల్‌లో పోలీసులపై దాడికి పాల్పడింది మేమే’ అంటూ తాలిబన్లు ప్రకటించారు. 40 మంది పోలీసులు మృతి చెందడంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఉలిక్కిపడింది.