: సీట్ బెల్ట్ ల నుంచి కొళాయిల వరకూ బంగారం పూతతో డొనాల్డ్ ట్రంప్ విమానం... 'ట్రంప్ ఫోర్స్ వన్' విశేషాలు!

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే అత్యాధునిక విమానాన్ని 'ఎయిర్ ఫోర్స్ వన్' అనే పేరుతో పిలుస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తదుపరి అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వద్దా ఓ అత్యాధునిక విమానముంది. దీన్ని ఆయన అభిమానులు ముద్దుగా 'ట్రంప్ ఫోర్స్ వన్' అని పిలుచుకుంటుంటారు. ఇక దీని ప్రత్యేకతలంటారా? అబ్బో... చాలానే ఉన్నాయి. ఇదో భారీ లోహ విహంగం. బోయింగ్ దీనిని తయారు చేసింది. తొలుత ఇది మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ పాల్ అలెన్ వద్ద ఉండేది. దీన్ని ట్రంప్ కొనుగోలు చేసి, తనకు తగ్గట్టు మార్పించుకున్నాడు. మొత్తం 200 మందికి పైగా ప్రయాణించే వీలున్న విమానాన్ని 43 మందికి మాత్రమే సరిపడేలా చేసుకున్నాడు. ఇక ఇందులో సీటు బెల్టుల నుంచి బాత్ రూం కొళాయిల వరకూ అన్నింటిపైనా 24 క్యారెట్ల బంగారం పూత ఉంటుంది. బెడ్ రూంలు, మీటింగ్ హాల్స్ వంటివి ఎలానూ ఉంటాయి. బార్, చిన్న జిమ్, అటెండర్లకు విడిగా సీట్లు వంటి సదుపాయాలున్నాయి. ఇక దీనిలోనే ట్రంప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రెసిడెంట్ ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విలువ 325 మిలియన్ డాలర్లు కాగా, ట్రంప్ వాడుతున్న దీని విలువ 100 మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందట.

More Telugu News