: నా ‘కంపెనీ’ కి షూటర్లు, గ్యాంగ్ మన్ కావాలి!: దర్శకుడు వర్మ
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఒక ట్వీట్ చేశారు. తన ‘కంపెనీ’ కోసం షూటర్లు, గ్యాంగ్ సభ్యులు కావాలని ఆ ట్వీట్ లో చెప్పారు. షూటర్లన్నారు కదా అని చెప్పి, తుపాకీ చేతబట్టి సిద్ధమవుదామనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే, సినిమాను షూట్ చేసే దర్శకులు, పనిచేసే వారు తనకు కావాలని ఆ ట్వీటర్థం. ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఆర్జీవీ కంపెనీ వెబ్ సైట్ ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. దర్శకత్వం చేయగలిగి, నిర్మాతల కోసం ఎదురు చూస్తుంటే తన వద్దకు రావాలని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేదని, ప్రపంచలో ఎక్కడ నివసిస్తున్న వారైనా రావచ్చని తెలిపారు. సినీ దర్శకుడు కావాలనుకునే ఒక కార్పెంటర్ లేదా కార్పెంటర్ లా మిగిలిపోయిన సినీ దర్శకుడు.. ఇలా ఎవరైన తమకు పట్టింపులేదని, తమ వద్దకు రావచ్చని వర్మ పేర్కొన్నారు.