: మంత్రి జోగు రామన్నకు పితృ వియోగం
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి జోగు రామన్న తండ్రి ఆశన్న (95) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతి చెందినట్లు మంత్రి కుటుంబసభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడలో ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు రేపు అక్కడే జరగనున్నాయి.