: మెల్ బోర్న్ లో అతిపెద్ద నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు


ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో అతిపెద్ద నకిలీ వీసా రాకెట్ గుట్టు రట్టయింది. భారతీయులకు ఉద్యోగాలు, విద్యావకాశాల పేరుతో నకిలీ వీసాలను అందిస్తున్న సదరు సంస్థ గుట్టు బయటపెట్టింది మెల్ బోర్న్ లో నివసిస్తున్నఒక భారతీయుడే కావడం విశేషం. ఈ నకిలీ వీసా రాకెట్ ను బయటపెట్టిన జస్విందర్ సిద్దూ మాట్లాడుతూ, మెల్ బోర్న్ లోని ఆర్ఎంఐటీ యూనివర్శిటీలో తాను లెక్చరర్ గా పనిచేస్తున్నానని చెప్పారు. కొన్నాళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యక్తి తనకు పరిచయమయ్యాడని, భారతీయులకు వీసాలు కావాలంటే ఏర్పాటు చేస్తానని, ఉద్యోగాలిప్పిస్తానని తనకు చెప్పాడని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన తరఫున ఉద్యోగాలకు లేదా చదువు నిమిత్తం వీసాల కోసం ఎవరినైనా పరిచయం చేస్తే కనుక ఐదువేల యూఎస్ డాలర్లు ఇస్తానని తనకు ఆఫర్ చేశాడని జస్విందర్ చెప్పారు. ముఖ్యంగా మెకానిక్స్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటీ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తెలిసిన వారు ఉంటే చెప్పాలని తనను అడిగాడని చెప్పారు. అయితే, ఈ సంప్రదింపులన్నింటిని హిడెన్ కెమెరా ద్వారా రికార్డు చేశానని జస్విందర్ చెప్పారు. ఈ ముఠా గుట్టును బయటపెట్టాలనుకున్నానని అందుకే ఇదంతా రికార్డు చేశానని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఆస్ట్రేలియన్ అధికారులకు, కొంతమంది భారతీయులకు సంబంధాలున్నాయని జస్విందర్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News